సనాతన ధర్మ ప్రచారంలో ‘తుంగా శ్రీ’ గారి విశేష పాత్ర

సనాతన ధర్మం అంటే మన హిందూ సంప్రదాయంలో శాశ్వతమైన సూత్రాలు, నిత్యమైన విలువలు. ఈ ధర్మం వ్యక్తి జీవితం సక్రమంగా సాగేందుకు, సమాజం సద్గుణాల వైపు అడుగులు వేయడానికి మార్గదర్శకమవుతుంది. ఈ ధర్మానికి అపారమైన ఆధ్యాత్మిక సంపద, సుసంపన్నమైన సంస్కృతి వున్నాయి. ఈ ధర్మాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నిలుపుతూ, యువతలో ధార్మిక ఆచరణను పెంచేందుకు ‘తుంగా శ్రీ’ గారు విశేష కృషి చేస్తున్నారు.

తుంగా శ్రీ’ గారు శ్రీ రామ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి బస్తీకి వెళ్లి సనాతన ధర్మంపై అవగాహన పెంచుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా హనుమాన్ చాలీసా పఠనానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. హనుమాన్ చాలీసా పఠనం ఒక వైపు భక్తి, ఆధ్యాత్మిక స్థైర్యాన్ని పెంపొందిస్తే, మరో వైపు దుష్టశక్తులనుండి రక్షణ కల్పిస్తుంది. అందువల్ల ప్రతి బస్తీలో చిన్నారుల నుంచి పెద్దల వరకు హనుమాన్ చాలీసా పఠించడం ప్రారంభిస్తున్నారు. ఇది వారి మనోబలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తోంది.

ప్రతి బస్తీ ఒక ‘శ్రీ రామ సేవా సమితి’ ఏర్పాటు చేయడం ద్వారా ఆచరణాత్మకంగా సనాతన ధర్మం పునాదులను బలపరుస్తున్నారు. సమితి ద్వారా బస్తీ స్థాయిలోనే చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించడం, భజన మండళి ఏర్పాటు, సనాతన సంప్రదాయాలు పరిరక్షించే విధంగా ప్రత్యేక శిక్షణ నిర్వహించడం మొదలైనవీ చేస్తున్నారు. ఇలా సమితి ఏర్పాటు ద్వారా స్థానికంగా భక్తి ప్రబోధం పెరిగే విధంగా ఒక ప్రణాళిక రూపొందించారు.

‘తుంగా శ్రీ’ గారు విశ్వసనీయత, సహనం, దృఢనిశ్చయంతో పనిచేస్తూ ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం గొప్పతనం తెలియజేయడానికి సుదీర్ఘంగా కృషి చేస్తున్నారు.