రామ నామ స్మరణతో భక్తిని పెంపొందిస్తున్న 'శ్రీ రామ సేవ సమితి'

భక్తిని పెంపొందిస్తున్న శ్రీ రామ సేవ సమితి

లోక క్షేమము కోసం శ్రీరామ నామ స్మరణ చూపిస్తూ ప్రజల్లో భక్తిని పెంచుతుంది శ్రీ రామ సేవ సమితి.

శ్రీరామ సేవా సమితి సంకల్పము ప్రజల్లో భక్తిని పెంపొందించడము, బస్తీలో 12 మందికి తక్కువ కాకుండా ఒక సమితిని ఏర్పాటు చేసి, నెలలో ఒకటి లేదా రెండు సార్లు సత్సంగ్ ఏర్పాటు చేస్తుంది. ఈ సత్సంగ్ లో పాల్గొన్న భక్తులు అత్యంత భక్తి భావముతో రామ నామ స్మరిస్తూ మానసిక ఆనందాన్ని పొందుతున్నారు.

శ్రీరామ సేవా సమితి సంకల్పము ప్రజల్లో భక్తిని పెంపొందించడము, అంతర్గత శాంతిని, ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందించడము. బస్తీలో 12 మందికి తక్కువ కాకుండా ఒక సమితిని ఏర్పాటు చేసి, ఆ భక్తులకు భజన పాటలు, భగవద్గీత నేర్పిస్తూ నెలలో ఒకటి లేదా రెండు సార్లు సత్సంగ్ ఏర్పాటు చేస్తుంది. ఈ సత్సంగ్ లో పాల్గొన్న భక్తులు భక్తి యొక్క రూపముగా శ్రీరామ నామ స్మరముగా తలచి అత్యంత భక్తి భావముతో రామ నామ స్మరిస్తూ మానసిక ఆనందాన్ని పొందుతున్నారు.

శ్రీరామ నామ స్మరణ ప్రధానముగా గుడుల్లో, ఇళ్లలో జరుగుతుంటుంది. కార్యక్రమ స్వరూపము క్రింది విధముగా ఉంటుంది.

  • ప్రార్థన
  • గణేష్ భజన పాట
  • శ్రీరాముని భజన పాటలు 4 లేదా అంతకన్నా ఎక్కువ
  • శ్రీ రామ నామ స్మరణ 108 సార్లు
  • భగవద్గీత లోని శ్లోకము పూర్తి వివరణ
  • లింగాష్టకము
  • హనుమాన్ చాలీసా 1 లేదా అంతకన్నా ఎక్కువ 108 సార్లు వరకు
  • హారతి
  • శాంతి మంత్రము

ఈ మహోత్తరమైన కార్యక్రమానికి కుల మత బేధం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని శ్రీరామ సేవ సమితి ఆహ్వానిస్తుంది.

ఈ మహోత్తరమైన కార్యక్రమములో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావచ్చని శ్రీరామ సేవ సమితి తెలియపరిచింది.

సంప్రదించవలసిన నంబర్ : 6301767565