మన సంపాదన నుంచి దేవుడుకి కొంత భాగం పెట్టాలా ?

సనాతన హిందూ ధర్మములో ధనిక- బీద , పండితుడు - పామరుఁడు, స్త్రీ పురుష, జాతి, కుల - మత, ప్రాంత భేదం ఎప్పుడు ఎక్కడా చూపలేదు.

ఎవరైననూ... ఎలాంటి వారైననూ... చిత్త శుద్దితో, పరమ భక్తితో... ఏది ఇచ్చినన్నూ ప్రీతితో స్వీకరిస్తానని భగవానుడు చెప్పెను. అలా అని సంపాదించిన దానిలో కొంత భాగం కావాలని కోరలేదు. కేవలం ఆకును గాని, పండును గాని, పూలను గాని, నీళ్లను గాని తక్కువలో తక్కువైననూ పరమ భక్తితో సమర్పించిన వాటిని ప్రీతితో ఆరగించునని భగవానుడు చెప్పెను.

మలిన శిత్తముతో ఏది ఇచ్చిననూ... ఎంత ఇచ్చిననూ... భగవానుడు స్వీకరించడు.

ఉదాహరణకు తన స్వార్థం కోసం ప్రేమ గాని, భక్తి గాని లేని రారాజైన దుర్యోధనుడు పూలతో బాట వేచి, వివిధ రకాల ఫలహారాలు, వంటలతో ఇచ్చిన ఆథిత్యమును భగవానుడు స్వీకరించలేదు. అదే నిరుపేదైన కుచేలుడు పరమ భక్తితో ఇచ్చిన అటుకులును అత్యంత ప్రీతితో సీకరించేను.

నిజానికి ఇవన్నీ ఆ పరమాత్మకు అవసరం లేదు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం తనలో ఉండకా ఆ పరమాత్మకు అవసరము ఏముంటుంది. అయినా మనం ప్రీతితో ఇస్తే తప్పక స్వీకరిస్తాడు.

ఉపనిషత్తుల ద్వారా జరిగిన కొన్నింటిని గమనిద్దాము. ప్రేమతో పరమ భక్తితో పత్రమును సమర్పించి విదురుడు, ద్రౌపతి ను. పుష్పమును సమర్పించి గజేంద్రుడు. ఫలమును సమర్పించి శబరి కృతార్థులైరి.

ఇదే విషయాన్ని పరమాత్మ భగవద్గీత లోని అధ్యాయం : 9 రాజవిద్యా రాజగుహ్య యోగము శ్లోకం : 26 గమనిద్దాము.

శ్లోకము :

పత్రం పుష్పం ఫలం తోయం యో మీ భక్తా ప్రయచ్ఛతి !
తదహం భక్త్యుపహతం ఆసనామి ప్రయతాత్మనః !!

తాత్పర్యం :- ఎవరు నాకు పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, జలమును గాని భక్తితో సమర్పించునో.. అట్టి నిర్మల బుద్దీ, నిష్కామ భావముగల భక్తులు భక్తి పూర్వకముగా సమర్పితమైన వాటిని స్వయముగా ప్రీతితో ఆరగింతును.