రామ నామ స్మరణ కార్యక్రమాలు
తేదీ : 5 మార్చి 2024 మంగళవారం కళావతి నగర్ శ్రీ హనుమాన్ దేవాలయము మరియు ఎన్.ఎల్.బి. నగర్ నందు శ్రీరామ సేవా సమితి ద్వారా శ్రీరామ నామ స్మరణ మరియు హనుమాన్ చాలీసా జరగాడమైనది. ఈ కార్యక్రమములో భక్తులు భక్తి శ్రద్దలతో పాల్గొని రామ నామ స్మరణను జపించడమైనది.
శ్రీ సంజీవ హనుమాన్ దేవాలయము
ఉదయం 11. గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు శ్రీ సంజీవ హనుమాన్ దేవాలయం, కళావతి నగర్ నందు శ్రీరాముని భజన పాటలు, 108 సార్లు శ్రీరామ నామ స్మరణ, లింగాష్టకము మరియు 11 హనుమాన్ చాలీసా శ్రీ సంజీవ హనుమాన్ శ్రీరామ సేవ సమితి ద్వారా జరగడమైనది.
శ్రీ సంజీవ హనుమాన్ దేవాలయం, కళావతి నగర్
NLB నగర్
రాత్రి 7. 30 నిమిషాల నుంచి 9. 00 గంటల వరకు NLB నగర్ శ్రీ రామ సేవా సమితి ద్వారా అమృతమ్మ గారి ఇంటిలో శ్రీ రామ నామ స్మరణ జరగాడమైనది. ఈ కార్యక్రమము వారి ఇంటిలో జరగడము చాలా ఆనందమని, తాను అనుకున్నది జరిగితే ఈ కార్యక్రమం చేపడతానని అనుకోవడముతో శ్రీరామ కరుణతో అంతా మంచే జరిగిందని కావున బస్తీవాసులను పిలిచి ఈ కార్యక్రమము చేపట్టినట్టు తేలిపోయింది.
NLB నగర్ శ్రీ రామ సేవా సమితి
శ్రీరామ సేవ సమితి ద్వారా లోక క్షేమము కోసంఇలాంటి కార్యక్రమాలు తరచూ చేపిస్తుంటుంది.