About Maha Shivaratri in Telugu
మహాశివరాత్రి హిందువులు ఆచరించే పండుగలలో ముఖ్యమైన పండగ. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. చాంద్రమాన మాసం లోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని మహా శివరాత్రి అంటారు. ఎంగ్లిష్ క్యాలెండర్ లెక్కల ప్రకారం పిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ పండుగ వస్తుంది.
ఈ రోజు శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు అని. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు అని చెపుతారు. సన్యాసులకు ఈ రోజును శివుడు కైలాష పర్వతంతో ఒకటయిన రోజు, శివుదు పరిపూర్ణ నిశ్చలత్వంతో, పర్వతంలా అయిపోయాడు చెపుతారు.
యోగ సంప్రదాయంలో యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు.
మహా శివరాత్రి రోజున అన్ని శివాలయాలు లో పవిత్రమైన లింగోద్భవ పూజ భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. శివుడు లింగ రూపంలో భూమి మీద కనిపించిందని, శివ పూజ అనుసరించుటకు అనువైన నిషితా కాలం సమయంలో నిషితా కాలం జరుపుకుంటారు.
పండుగను ప్రధానంగా బిల్వ ఆకులు శివుడికి సమర్పణల ద్వారా జరుపుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం, రాత్రి అంతా జాగరణ చేసారు. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. ఈ రోజు శివభక్తులు తెల్లవారుజామున నిద్ర లేచి, స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి రాత్రి అంతా శివ పూజలు, అభిషేకములు, అర్చనలు, శివలీలా కథాపారాయణలు, భజనలు జరుపుకుంటూ జాగరణము చేసి మరునాడు భోజనం చేస్తారు.
ఈ రాత్రి, భూమి ఉత్తర అర్థగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. ఈ రోజున ప్రకృతి మిమల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది. దీనిని ఉపయోగించుకోవడానికే, రాత్రంతా ఈ పండుగను నెలకొల్పారు.
భక్తులు తెల్లవార్లూ జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా శక్తులు సహజంగా పైకి ఎగసి పడడానికి సహకరించవచ్చు.